Chanti Swamy: పంచాయ‌తీ సెక్రటరీ చంటి స్వామికి సన్మానం

సిరాన్యూస్‌, సొనాల‌
పంచాయ‌తీ సెక్రటరీ చంటి స్వామికి సన్మానం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లంలోని సోనాల గ్రామపంచాయతీలొ గత పది సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించిన చంటి స్వామి వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ సంద‌ర్బంగా మాజీ సర్పంచ్ చెట్ల పెళ్లి సదానందం మాట్లాడుతూ పంచాయితీ సెక్రటరీ గా స్వామి మన గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. సౌమ్యుడు వివాద రహితుడు అయిన స్వామి కృషితో సోనాల గ్రామపంచాయతీ ఎంతో అభివృద్ధి చెందిందని తెలియజేశారు. అదే సమయంలో ఇటీవలే సోనాల గ్రామపంచాయతీకి బదిలీపై వచ్చిన కార్యదర్శి ఎస్ వెంకటరమణ ని శాలువ సత్కరించిస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రామాయి గంగామణి, మాజీ వార్డు సభ్యులు బొజరాజ్, జీవన్ పంచాక్షరి, కల్పన, సంగీత, జ్యోత్స్న, లక్ష్మి, గ్రామ పెద్దలు మురళీధర్, ప్రకాష్ ,శ్రీను అజాహార్, పారిశుద్ధ కార్మికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *