Chemistry Resonance Jr. College: సాటి లేని విద్యాసంస్థగా కెమిస్ట్రీ రెసోనెన్స్‌

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

సాటి లేని విద్యాసంస్థగా కెమిస్ట్రీ రెసోనెన్స్‌

+ జేఈఈ, ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలతో ముందంజ
+ నాణ్యమైన విద్యే లక్ష్యమంటున్న డైరెక్టర్‌ దామెర్ల ప్రమోద్‌ రెడ్డి

ఆదిలాబాద్‌కు చెందిన ‘కెమిస్ట్రీ రెసోనెన్స్‌ జూనియర్‌ కాలేజీ’ ఇంటర్, జేఈఈలలో అత్యుత్తమమైన ర్యాంకులతో సాటిలేని విద్యా సంస్థగా సత్తా చాటుకుంటోంది. ఇటీవలే నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో రెసోనెన్స్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆల్‌ ఇండియా లెవల్‌ ర్యాంకులు కైవసం చేసుకొని, జేఈఈకి అర్హత సాధించారు. ఇంటర్‌ ఫలితాల్లో సైతం ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌ నుండి ఏకంగా 11మంది విద్యార్థులు 460+ మార్కులు సాధించి స్టేట్‌ ర్యాంకులు సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌ బైపీసీలో నలుగురు విద్యార్థులు 430+ మార్కులు సాధించి అత్యుత్తమమైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు కొనసాగుతున్న తరుణంలో కళాశాలలో వసతులు, సాధించిన విజయాలు, విధివిధానాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి విద్యా సంస్థ డైరెక్టర్‌ దామెర్ల ప్రమోద్‌ రెడ్డితో ఇంటర్వ్యూ…

దామెర్ల ప్రమోద్ రెడ్డి(M.Sc., B.Ed.), డైరెక్టర్, కెమిస్ట్రీ రెసొనెన్స్ జూనియర్ కాలేజీ, ఆదిలాబాద్

సిరా న్యూస్‌: అతి తక్కువ కాలంలోనే కళాశాల మంచి విజయం సాధించడం ఎలా అనిపిస్తోంది?
ప్రమోద్‌ రెడ్డి: చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తుల్లో మరిన్ని ఎక్కువ ర్యాంకులతో నంబర్‌ వన్‌గా నిలవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాము.

సిరా న్యూస్‌: మీకు మరెక్కడైన బ్రాంచ్‌లు ఉన్నాయా?
ప్రమోద్‌ రెడ్డి: ఆదిలాబాద్‌లో తప్పితే రాష్ట్రంలో మాకు మరెక్కడ కూడ బ్రాంచీలు లేవు. మాకు వేరే విద్యా సంస్థలతో కూడ ఎలాంటి సంబంధం లేదు.

సిరా న్యూస్‌: మీ కళాశాల ప్రత్యేక ఏమిటి? ర్యాంకులు సాధించడం వెనుక మీరు అవలంభిస్తున్న వ్యూహాలు ఏమిటి?
ప్రమోద్‌ రెడ్డి: మంచి అహ్లాదమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రత్యేకత. ప్రతీ ఒక్క విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో తరగతులు చెప్పడం జర్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో దాదాపు 15–20 సంవత్సరాల అపార బోధన అనుభవం గల అధ్యాపకులు మా వద్ద ఉన్నారు. బట్టీ విధానంలో కాకుండా అర్థవంతమైన బోధన మా ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *