సిరా న్యూస్, భీమదేవరపల్లి
ఈనెల 23న మాణిక్య పూర్‌లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ : చెప్యాల ప్రకాష్
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్, మాణిక్య పూర్ లో ఈనెల 23న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాలా ప్రకాష్ తెలిపారు. శనివారం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ ప్రజలు, అలాగే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి దళిత బహుజన మేధావులు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా దళిత మేధావులైన ప్రొఫెసర్లు వక్తలుగా వస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఐలయ్య, అశోక్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.