Chepyala Prakash: కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు :  అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు :  అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్

తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతరాజు లాలయ్య రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న‌ట్లు తెలంగాణ అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. శ‌నివారం భీమదేవరపల్లి లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. భారత దేశంలో జరుగుతున్న సమీకరణలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అంబేద్కర్ సంఘం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరుగుతుంద‌న్నారు. బీజేపీ ప్రభుత్వం గతంలో మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో ఎస్సి వర్గీకరణ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది, కానీ 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం మాదిగ జాతికి తీవ్ర అన్యాయం చేసింద‌న్నారు. వర్గీకరణ చేయకపోవడం చాలా బాధాకరమ‌ని తెలిపారు. మళ్లీ మేము అధికారంలోకి వస్తే వర్గీకరణ తప్పకుండా చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మాకు 400 ఎంపీ సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక ఎంపీ అనంత కుమార్ హెగ్డే , కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బిజెపి సంబంధించిన ప్రజాప్రతినిధులు మాట మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపికి దళిత బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను ఏ విధంగా ఓట్లు మీరు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ వాదులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంపూర్ణ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరారు.భారతదేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ కవులు, కళాకారులు, శ్రమజీవులు ,విశ్రాంతి ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ కు భారీ మెజార్టీతో గెలిపిస్తూ తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలిచే విధంగా కాంగ్రెస్ వాదులు మిగతా వర్గాల ప్రజలు ఏకతాటిపై వచ్చి కలిసి మెలిసి ఉధృతంగా ప్రచారం చేసి గెలిపించాలని అన్నారు. స‌మావేశంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం హుస్నాబాద్ నియోజకవర్గం బాధ్యులు పొన్నాల ఫ్రాన్సిస్, గంగారపు రవి, గిరిమల్ల చంద్రమౌళి , కిషోర్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *