సిరాన్యూస్,భీమాదేవరపల్లి
తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపిద్దాం : తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
ప్రజా గొంతుక నిరుద్యోగ,ఉద్యోగ సమస్యలపై నిత్యం ప్రశ్నించే గొంతుక మీ తీన్మార్ మల్లన్న ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. శనివారం భీమాదేవరపల్లి మండలంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లపాటు పాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిందన్నారు. కేంద్రంలో బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మరి పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్,మోడీ లు కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా మెగా డీఎస్సీ వేస్తానని చెప్పిన కెసిఆర్ గ్రూప్ 1,2 పరీక్షలు పేపర్ లీకేజీ చేసి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను అమ్ముకున్నది బిఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. పట్టభద్రుల శాసన మండలికి ప్రజల పక్షాన పోరాడే తీన్మార్ మల్లన్న ను భారీ మెజార్టీతో గెలిపించి చట్టసభల్లో పంపాలని కోరారు.కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు గుగులోతు లక్ష్మణ్ నాయక్, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు మాడుగుల జయపాల్, మహమ్మద్ యూసుఫ్ తెలంగాణ ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.