సిరా న్యూస్, సొనాల
విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన చెట్లపెల్లి సుధీర్
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలానికి చెందిన చెట్లపెల్లి సుధీర్ తన కుమారుడు చెట్లపెల్లి అకిరానందన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా పరుపుల పల్లె , టీవీటీ పల్లె ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు.తమ కుమారుడి జన్మదిన వేడుకలు పాఠశాల విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు గంగాధర్ తుల అజయ్, కోస్మెట్టి యోగి, బబ్లూ, సునీల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.