పారిశుద్ధ్య లోపం… ప్రజలకు శాపం…
– చిగురుమామిడి 12 అవార్డులో రాజ్యమేలుతున్న సమస్యలు
– రోడ్లపై పాడుతున్న మురుగునీరు
– పట్టించుకోని అధికారులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని 12వ వార్డులో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే యథేచ్చగా మురికి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. మురికి కాలువలో పూడిక తీయకపోవడంతో కాలువలు నిండి పారుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వార్డులో దుర్గంధం భరించలేకపోతున్నామని అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు. పారిశుధ్యం లోపించడంతో రాత్రివేళ విపరీతంగా దోమలు వేధిస్తున్నాయని చెబుతున్నారు. ప్రజలు తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారని అధికారులు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.