సిరాన్యూస్, చిగురుమామిడి
ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు
చిగురుమామిడి మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మంత్రి ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.