chigurumamidi: చిగురుమామిడిలో గాలివాన బీభత్సం

సిరాన్యూస్‌, చిగురుమామిడి
 చిగురుమామిడిలో గాలివాన బీభత్సం
* కూలిన గోడ‌.. నేల‌కొరిగిన చెట్లు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. బొమ్మనపల్లి గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన ఆవుల షెడ్డు నేల‌మ‌ట్ట‌మైంది. షెడ్‌ రేకులు గాలికి ఎగిరిపోయి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభంపై పడ్డాయి. సమయానికి ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ శాఖ అధికారుల వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. తాళ్ల దేవేందర్ కి చెందిన ఇంటి ప్రహరీ గోడ పూర్తిగా కూలిపోయింది. వేపకొమ్మలు విరిగిపడి చలివేంద్రం ధ్వంసమయింది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *