సిరా న్యూస్,చిగురుమామిడి
డబుల్ రోడ్డు పూర్తి చేయాలని నేలపై కూర్చుని ఎంపీటీసీ సభ్యుల నిరసన
* వాడీవేడిగా సాగిన మండల సర్వసభ్య సమావేశం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గురువారం మండల ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు.విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్, ఎక్సైజ్ మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి వివిధ శాఖలపైన చర్చించారు.జీలు విత్తనాల పంపిణీలో రైతులు ఇబ్బందులు పడ్డారని ముదిమాణిక్యం ఎంపీటీసీ ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శించారు. విత్తనాల పంపిణీ సమయంలో పోలీసుల అత్యుత్సాహాన్ని ఖండించారు.ప్రభుత్వ ఆదేశాలతోనే పంపిణీ చేసినట్లు ఏవో రంజిత్ రెడ్డి తెలిపారు. బొమ్మనపల్లి లో మెడికల్ ఆఫీసర్, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్ట్ లను భర్తీ చేయాలని బొమ్మనపల్లి ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం మాట్లాడారు.అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పనిచేస్తున్నామని ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సుందరగిరి నుండి ఇందుర్తి వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు ఇంత వరకు పూర్తి చేయకపోవడం పట్ల సుందరగిరి, ఇందుర్తి, ముల్కనూరు, బొమ్మనపల్లి, రేకొండ ముదిమాణిక్యం గ్రామాల ఎంపీటీసీలు మెడబోయిన తిరుపతి, అండ్ స్వప్న, పెసర జమున, మిట్టపల్లి మల్లేశం, కొత్తూరు సంధ్య ఏలేటి రవీందర్ రెడ్డి లు నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక వైపు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న తరుణంలో ఎంపీటీసీ జడ్పిటిసి ల పదవి కాలం కూడా జూలైతో పూర్తవుతుండడం, ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో సమస్యలను లేవనెత్తుతూ వాడివేడిగా సాగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గీకురు రవీందర్, ఎంపీడీవో మధుసూదన్, డిప్యూటీ తహసీల్దార్ పార్థసారథి, సూపరిండెంట్ ఖజమైనుద్దీన్, వివిధ శాఖల అధికారులు స్పెషల్ ఆఫీసర్స్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.