సిరా న్యూస్, చిగురుమామిడి:
రాష్ట్ర స్థాయి కరాటే పోటిల్లో సత్తా చాటిన చిగురుమామిడి విద్యార్థులు…
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం విద్యార్థులు సత్తా చాటారు. ఈనెల 11 న నల్గొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో చిగురుమామిడి మండలం కొండపూర్ గ్రామనికి చెందిన బుర్ర కరుణాకర్ బంగారు పతకం సాధించాడు. మండల కేంద్రం లోని డార్విన్ పాఠశాల కు చెందిన విద్యార్థి అశ్విక్ రజత పతకం, కొండపూర్ గ్రామనికి చెందిన గూడెపు విక్రమ్, బుర్ర నీతేష్ లు కాంస్య పథకాలు సాదించినట్లు కరాటే మాస్టర్ బండారిపల్లి రమేష్ తేలిపారు. పథకాలు సాధించిన విద్యార్థు తెలంగాణ రాష్ట్ర జె కె ఎ షోటోకాన్ కరాటే చీఫ్ రాపోలు సుదర్శన్ పతకాలు, సర్టిఫికేట్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, పథకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.