సిరా న్యూస్, చిగురుమామిడి:
ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి…
-జడ్పీటీసీ గీకురు రవీందర్
ప్రభుత్వ పథకాలను పొందేందుకు వీలుగా ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించాలని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల జడ్పీటీసీ గీకురు రవిందర్ అన్నారు. మంగళవారం మండలంలోని నవాబుపేట, ఓగులాపూర్ గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం, గృహ జ్యోతి మహాలక్ష్మి, రైతు భరోసా చేయూత, ఇందిరమ్మ ఇండ్ల తో కూడిన గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా ప్రజా పాలన గ్రామసభాలను గ్రామాల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నెల 6 వరకు మొదటి విడత ప్రజాపాలన కార్యక్రమం మండలంలోని 17 గ్రామాలలో పూర్తవుతుందన్నారు. కొందరు లబ్ధిదారులు తమకు రేషన్ కార్డు లేదు అని జడ్పిటిసి కి తెలుపగా, ప్రజా పాలన దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు కోసం సైతం దరఖాస్తు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ నరేందర్, ఎంపీడీవో మామిడాల నరసయ్య, మండల వ్వవసాయ అధికారి రంజిత్ రెడ్డి, డిప్యూటి తాసిల్దార్ పార్థ సారధి, సర్పంచ్ లు సుద్దాల ప్రవీణ్, బోయిన్ శ్రీనివాస్, ఎంపీటీసీలు మంకు స్వప్న, శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజయ్య, నాయకులు ప్రవీణ్ కుమార్, రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు, పాల్గొన్నారు.