సిరా న్యూస్,శ్రీకాళహస్తి ;
గత మూడు రోజులుగా శ్రీకాళహస్తి పట్టణంలోని పాఠశాలల మరియు కళాశాలల బస్సులను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో 9 బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగింది.ఇందులో 5 బస్సులు విద్యార్థులను పరిమితికి మించి తీసుకువెళ్లడం, 2 బస్సులు డ్రైవర్లకు సరైన లైసెన్స్ లేకుండా అంటే ఐదు సంవత్సరాల అనుభవం లేకుండా నడుపుతున్నట్లు గుర్తించాము మరియు 2 బస్సులకి ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగింది.
ఈ కేసుల ద్వారా టాక్స్ మరియు పెనాల్టీలు రూపేనా 70 వేల 400 రూపాయలు వసూలు చేయడం జరిగింది.ఈ తనిఖీలలో చాలా బస్సులలో విద్యార్థులను పరిమితికి మించి తరలిస్తున్నట్లు గుర్తించాము.
ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాలల యాజమాన్యాలు గమనించి విద్యార్థుల సంఖ్యను అనుసరించి సరిపడా బస్సులు ఏర్పాటు చేసుకోవాలని కోరుచున్నాను. ఈ తనిఖీలు ఇకముందు కూడా కొనసాగుతాయి. ఎవరైనా సరియైన రికార్డ్స్ లేకుండా మరియు అనుభవం లేని డ్రైవర్లచే పాఠశాల బస్సులను నడిపినట్లు గమనించిన యెడల ఆ వాహనాలను నిర్బంధించడం జరుగుతుంది. కావున పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి వాహనాలు నడిపి విద్యార్థులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చవలసిందిగా కోరుచున్నాను. లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటానని దామోదర్ నాయుడు,మోటార్ వాహన తనిఖీ అధికారి అన్నారు