chiluka Satish: విద్యార్థుల‌కు పెన్నులు అంద‌జేసిన ఉపాధ్యాయుడు చిలుక సతీష్

సిరాన్యూస్‌, బోథ్‌
విద్యార్థుల‌కు పెన్నులు అంద‌జేసిన ఉపాధ్యాయుడు చిలుక సతీష్
* కన్గుట్ట ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు జ‌న్మ‌దిన వేడుక‌లు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లం కన్గుట్ట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చిలుక సతీష్ తన యొక్క పుట్టిన రోజు వేడుక‌లు కన్గుట్ట ప్రాథమిక పాఠ‌శాల‌లో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈసంద‌ర్బంగా ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ ఒక్కొక్క స్వీట్లు, పెన్నులను చిన్ని కానుకలుగా అందజేసి పిల్లల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుక‌ల‌కు నోడల్ ఆఫీసర్ పోశెట్టి ముఖ్యఅతిథిగా హాజ‌రై మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా జన్మదినోత్సవాలను, పెళ్లి రోజులను పిల్లల మధ్యనే జరుపుకుంటూ, పిల్లలకు నిరంతరం సొంత నిధులతో చిన్ని కానుకలు అందజేస్తూ, పిల్లలకు పలు నూతన విషయాలను తెలుపుతూ పిల్లలలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్న చిలుక సతీష్ ను అభినందించారు. అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాకేష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు చిలుక సతీష్ నిరంతర కృషిని కొనియాడారు. పాఠశాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉపాధ్యాయుడు చిలుక సతీష్ మాట్లాడుతూ తన జీవితంలో 34 సంవత్సరాలు గడిచిపోయాయని, కాలం ఆగదని కావున ప్రతిరోజు జీవితంలో విలువైనదని పిల్లలకు తెలిపారు. ప్రతిరోజు అన్ని విషయాలలో ముందుండాలని, ప్రతిరోజు పాఠశాలలో చెప్పినటువంటి విషయాలను క్రమం తప్పకుండా బాగా చదువుకోవాలని పిల్లలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే తర్వాత ప్రతి విద్యార్థికి ఒక స్వీట్ను అలాగే పెన్నులను చిన్ని కానుకగా అందజేసి జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. అలాగే జగిత్యాలలో లిటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానాన్ని కూడా తన జన్మదినోత్సవం సందర్భంగా తనవంతుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రాథమిక అలాగే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నోడల్ ఆఫీసర్ పోశెట్టి ,రాకేష్ కుమార్ ల‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుదర్శన్ గౌడ్, సీతారాం , అంగన్వాడి సిబ్బంది, మధ్యాహ్న భోజన సిబ్బంది, మాజీ ఎస్ఎంసి చైర్మన్ కైపెల్లి రాజు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *