సిరాన్యూస్, హుజురాబాద్
ధర్మసమాజ్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా చిలువేలు శ్రీకాంత్
ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు లోక్ సభ అభ్యర్థిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన చిలువేరు శ్రీకాంత్ మహారాజ్ అభ్యర్థిగా నియమించినట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు.కరీంనగర్ పార్లమెంటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలంతా ధర్మసమాజ్ పార్టీ చెప్పు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అణగారిన వర్గాల రాజ్యాధికార మే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ పని చేస్తుందని తెలిపారు.