సిరా న్యూస్, చిగురుమామిడి:
చిన్న మూల్కనూర్ లో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులకు అబినందనలు తెలిపిన గ్రామస్తులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిన్స ముల్క్తనూరు గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఇండియన్ ఫార్మసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఇండియన్ ఫార్మసీ సహకారంతో ప్రోగ్రాం కోఆర్డినేటర్, మాజీ ఉపసర్పంచ్ కయ్యం తిరుపతి పటేల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న వారికి కూడా ప్రత్యేక బహుమతులు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలో 65 మంది, ఎంటర్టయిన్ మెంట్ ఆటల్లో 200 మది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇండియన్ ఫార్మసీ సిబ్బంది కయ్యం తిరుపతి పటేల్, మాజీ ఉపసర్పంచ్ సాంబారి బాబు, నిర్వాహకులు, గ్రామ యువకులు చిలువేరు వెంకటేష్, లెంకల మహేష్, పూదరి వేణు గౌడ్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ బరిగల సదానందం, పడాల కైలాసం, వంగపల్లి సంపత్, కన్నోజు ఈశ్వర్, బ్రహ్మయ్య, మెరుగు శ్రీనివాస్, రంగు శ్రీధర్, పైడిపల్లి సతీష్, వంగపల్లి చందు, బూస చందు, చెల్లోజు విక్రమ్, గాదాసు భాస్కర్, కత్తెరమల రమేష్, పిట్టల రాజు, ముసుకుల ప్రభాకర్ రెడ్డి, మర్రి రాజు యాదవ్త దితరులు పాల్గొన్నారు.