సిరా న్యూస్, బోథ్
చింతగూడలో విద్యుద్ఘాతంతో ఆవు మృతి
విద్యుద్ఘాతంతో ఆవు మృతి చెందిన సంఘన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని చింతగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన గోడం లక్ష్మణ్ అనే రైతుకు చెందిన ఆదివారం సాయంత్రం విద్యుద్ఘాతానికి గురై మృతి చెందింది. ఆదివారం సాయంత్రం పూట వేసిన ఈదురుగాలుల వల్ల వ్యవసాయ చేన్లో ఉన్న 11 కెవి విద్యుత్ తీగల తగిలి మృతి చెందింది. దీంతో రైతుకు రూ.30 వేల మేరకు నష్టం సంభవించింది.