సిరాన్యూస్, ఓదెల
బాబ్లీ ప్రాజెక్టు కేసులో విచారణకు హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
* ఏండ్ల తరబడి సాగుతున్న బాబ్లీ కేసు విచారణ
మహారాష్ట్రలోని బిలోలి సేషన్ కోర్టులో బాబ్లీ కేసు విషయంపై విచారణకు బుధరవాం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు. ఆయన వెంట కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే ఉన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మించి నీళ్ళు రాకుండా చేయడంతో 2010 సంవత్సరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అప్పటి ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్యే లము అందరం భారీ ఆందోళనలకు దిగడం జరిగిందని తెలిపారు. అయితే బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే వరకు కదలకుండా మేమందరం ఉండడంతో మహారాష్ట్ర పోలీసులు అప్పటి టీడీపీ నాయకులపై లాఠీ ఛార్జి చేసి చంద్రబాబు తో సహా మా పై కేసులు నమోదు చేశారన్నారు. ఆ కేసుల విచారాలలో భాగంగా ఏళ్ల తరబడి మా వాదనలు వినిపించడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి కేసులు తమపై ఎన్ని మోపిన ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.