సిరా న్యూస్, ఓదెల
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు వారి కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అలాగే ఎమ్మెల్యే దంపతులు స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట ఆశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈసందర్బంగా దేవస్థాన అర్చకులు ఎమ్మెల్యే విజయరమణ రావు దంపతులకు వేద మంత్రాలతో శాలువా కప్పి స్వామి వారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.