సిరాన్యూస్, బోథ్
చింతలబోరిలో చిరుత పులి దాడిలో ఆవు మృతి
చిరుత పులి దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని చింతలబోరి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బోథ్ సొనాల మండలంలోని పార్టీ బి గ్రామానికి చెందిన రైతు తుడసం సీతారాం కు చెందిన ఆవు బుధవారం చింతల బోరి అటవీ ప్రాంతంలో మేతమేస్తుండగ పులి దాడి చేసి చంపివేసింది. చిరుత దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నష్టపోయిన రైతుకు పరిహారం అందే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.