సిరాన్యూస్, చిగురుమామిడి
చిగురుమామిడి నులిపురుగుల నివారణ మందుల పంపిణీ
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిగురుమామిడి మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో 1-19 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. బొమ్మనపల్లి గ్రామంలో సెకండ్ ఏఎన్ఎం జి స్వరూప ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ వేశారు.వారు మాట్లాడుతూ నులిపురుగులు కడుపులో ఉండడం వల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల కొంటుపడుతుందని అన్నారు. తప్పకుండా మాత్రలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు సుజాత, సుగుణ, లింగవ్వ, అంగన్వాడి టీచర్స్, ఆయాలు పాల్గొన్నారు.