సిరా న్యూస్, కందుర్పి:
చౌడేశ్వరీ ఆలయంలో ఉమ మహేశ్వర నాయుడు ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం రూరల్ మండలంలోని మల్లిపల్లి గ్రామ దేవత చౌడేశ్వరీ మాత ఆలయంలో, కళ్యాణదుర్గం నియోజక వర్గ టీడీపీ ఇంచార్జీ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన, జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలంత సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కుకున్నారు.