సిరా న్యూస్, బోథ్
బోథ్‌లో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన సీఐ రమేశ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను బోథ్ సీఐ రమేష్ తో పాటు ఎస్సై బి రాము తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా షాపుల్లోని రికార్డులను, స్టాప్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విత్తన దుకాణాలలో ప్రభుత్వ నిర్ణయించిన ధరకు విత్తనాలు అమ్మాలని సూచించారు. అంతేకాకుండా బ్లాక్‌లో విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల కేంద్రంలోని మధుకర్ సీడ్స్ కంపెనీ విత్తన దుకాణాన్ని తనిఖీ చేయడం జరిగింది.