CI Sainath: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి:  సీఐ సాయినాథ్

సిరాన్యూస్‌, జైన‌థ్‌
సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి:  సీఐ సాయినాథ్

సమాజంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని సీఐ సాయినాథ్ అన్నారు. సోమ‌వారం ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌ల పోలీసు స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. అపరిచితుల నుంచి ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌, వాట్సప్‌ల ద్వారా వచ్చే బ్లూ కలర్‌ లింక్స్‌ను క్లిక్‌ చేస్తే, మీ మొబైల్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి పోతుందని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫోన్ పే , గూగుల్ పే ద్వారా రివార్డ్స్, క్యాష్ బ్యాక్ వచ్చాయంటూ లింక్స్ పంపించినట్లయితే వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *