సిరాన్యూస్,జైనథ్
జైనథ్ మండలంలో 30 పోలీస్ యాక్ట్ అమలు: సీఐ సాయినాథ్
శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జైనథ్ సీఐ సాయినాథ్ ప్రకటించారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జైనథ్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రాష్ట్ర రహదారులపై ధర్నాలు ,రాస్తా రోకోలు నిర్వహించరాదని తెలిపారు. రైతులు, యువకులను రెచ్చగొట్టే రాజకీయ నాయకుల పై నిఘా ఉంచామని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తు రైతులను తప్పు తోవపట్టించిన వారి పై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ విజ్ఙప్తి చేశారు.