సిరాన్యూస్,ఆదిలాబాద్
అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి
అంగన్వాడీ టీచర్స్ , హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అంగన్వాడీ టీచర్స్ , హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. మంగళవారం అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి, జులై 24 తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు అంగన్వాడి ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ కు 2 లక్షలు హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతామని, పెన్షన్ వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ , హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత జిల్లా అధ్యక్షురాలు డి. వెంకటమ్మ నాయకులు, డి సునీత, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ నాయకులు యాటల సోమన్న, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆశన్న అన్నమొల్ల కిరణ్ పాల్గొన్నారు.