సిరాన్యూస్, సైదాపూర్:
ఎస్సై తిరుపతి ని సన్మానించిన సీఐటీయూ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్
సైదాపూర్ మండలానికి ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్సై తిరుపతి ని సీఐటీయూ మండల అధ్యక్షుడు మొలుగూరి ప్రేమ్ కుమార్, కొమ్ముల భిక్షపతి, దొంత కుమారస్వామి, కలువల బాబు రావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల సీఐటీయూ అధ్యక్షుడు మొలుగూరి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయాలలో తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు.