సిరా న్యూస్,బీజాపూర్;
బీజాపూర్ ఆడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు డిప్యూటీ కమాండర్తో సహా ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన నక్సలైట్లలో మహిళా నక్సలైట్ మృతదేహం కూడా లభ్యం అయింది. ఘటన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి.
పోలీసులంతా క్షేమం. సెర్చ్ ఆపరేషన్ లో కోబ్రా 210, 205, సీఆర్పిశ్రీప్, డీఆర్జీ సిబ్బంది ఉమ్మడి బృందం పాల్గోన్నారు. హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ అధికారులు ఈ ఆపరేషన్పై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పూర్భట్టి ప్రాంతంలోని తాల్పేరు నది సమీపంలో ఘటన జరిగింది.