వైట్నర్ గ్యాంగుల ఘర్షణ

ఒకరు మృతి..మరోకరికి తీవ్ర గాయాలు
 సిరా న్యూస్,హైదరాబాద్;
మద్యం మత్తులో యాచకుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. మరొక్కరి పరిస్తితి విషమంగా మారింది.. వైట్ నర్ గ్యాంగ్ ఒకరిని అతి దారుణంగా నరికి చంపడం తో పాటు మరొకరిపై హత్య యత్నం కు పాల్పడ్డారు.నిందితులపై మార్కెట్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదు కాగా, వీరిపైనే మారేడ్ పల్లి పిఎస్ లో హత్యా యత్నం కేసు నమోదు అయింది

మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న యాచకులు మధ్య మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో ముగ్గురు యాచకులు కలిసి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తి తో నరికి గొంతు కోసి చంపారు. అంతటితో ఆగకుండా మారేడ్పల్లిలో దేవాలయం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో పొడిచారు.. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి హత్యకు పాల్పడ్డ ముగ్గురు తప్పించుకొని పారిపోయారు..కేస్ నమోదు చేసుకున్న మార్కెట్ పోలీస్ లు, మారేడ్ పల్లి పోలీసులు ముగ్గురు సైకో కిల్లర్ ల కోసం గాలిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *