భాకరపేట చెరువులో మృతదేహం లభ్యం
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతిలోని బాల మందిర్ పాఠశాల బాలుడు మిస్సింగ్ అయ్యాడు. రేణిగుంట బుగ్గ వీధికి చెందిన 4 వ తరగతి చదువుతున్న కె.ముని నిరంజన్ (9), బాల మందిర్ పాఠశాల విద్యనభ్యసిస్తున్న విద్యార్థి. అదే పాఠశాలలో 6వ తరగతి విద్యార్థి సతీష్ తో పాటు భాకరాపేటకు ముని నిరంజన్ వెళ్లాడు. బాలుడిని భాకరాపేటలో బస్సు ఎక్కించి పంపినట్లు సతీష్ చెబుతున్నాడు. బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో వెస్ట్ పోలీస్ స్టేషన్ లో తల్లి స్వాతి ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం భాకరాపేట చెరువులో ముని నిరంజన్ మృతదేహాన్ని భాకరాపేట పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.