పరిశ్రమల్లో పరిశుభ్రత పాటించాలి.

ఆర్ జి త్రీ జి ఎం సుధాకర్ రావు
 సిరా న్యూస్,కమాన్ పూర్;
పరిశ్రమల్లో పరిశుభ్రత పాటించాలని సుధాకర్ రావు అన్నారు.
ఆర్జిఓసీఎం 1, ఆర్‌జి3 ఏరియా
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బొగ్గు పరిశ్రమలలో పరిశుభ్రత పాటించాలనే తలంపుతో స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించడం జరుగుతుంది. సింగరేణి సంస్ధ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రారంభించుకొవడం జరిగింది. అందులో భాగంగా గురువారం ఓసీ1 బేస్ వర్క్ షాప్ నందు స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమాన్ని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు  ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఓసీ1 బేస్ వర్క్ షాప్ లో మొక్కలు నాటారు అనంతరం పరిసరాలను పరిశుబ్రపరిచారు.
ఓసీ 1 ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్. రాధా కృష్ణ  మాట్లాడుతూ… ఈ 15 రోజులే కాకుండా ప్రతి రోజు కూడా పరిశుభ్రతను విధిగా ఆచరించాలని తమ ఇంటిలో, ఆఫీసులో ఈ స్వచ్చ్ కార్యక్రమాన్ని చేపట్టి ఆరోగ్యకరమైయన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
జనరల్ మేనేజర్  నరేంద్ర సుధాకర రావు  మాట్లాడుతూ… మహాత్మా గాంధీ  స్వాంతంత్ర్యం కంటే పరిశుభ్రత ముఖ్యం అనేవారు అని గుర్తు చేశారు. దీనిని అనుసరించి మన భారత ప్రభుత్వము స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమాన్ని 30 రోజుల పాటు నిర్వహిస్తుందని అన్నారు. దీని ద్వారా బొగ్గు పరిశ్రమలలో అవగాహన తీసుకువచ్చి పరిశుభ్రమైన పని స్ధలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలు నిర్మించుకుంటే అవే అభివృద్దికి పునాదులౌతాయని ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ తమ పరిధిలో శుభ్రత పాటిస్తూ, పరిసరాలను కూడా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని హితవు పలికారు. స్వచ్చతా అనేది మన జీవన విధానంగా మారాలని అన్నారు. ప్రతి వ్యక్తి పరిశుభ్రత పాటించినట్లైతే తన కుటుంబంతో పాటు ఆ సమాజం / గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడూ మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని, పనిలో కూడా శ్రద్ద పెరిగి ఎలాంటి పొరపాట్లకు ఆస్కారముండదని అభిప్రాయపడ్డారు.
ఓసీ 1 ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్.రాధా కృష్ణ  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజీఎం శ్రీ జి. రఘుపతి, మేనేజర్ ఉదయ్ హరిజన్, ఐ‌ఎన్‌టి‌యూ‌సి పిట్ సెక్రెటరీ  సదానందం, ఏ‌ఐ‌టి‌యూ‌సి పిట్ సెక్రెటరీ రమేష్, ఏరియా ఎన్విరాన్మెంట్ అధికారి పి.రాజా రెడ్డి, డి‌వై‌ఎస్‌ఈ సివిల్  రాజేంద్ర ప్రసాద్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ఫారెస్ట్ అధికారి కల్యాణ్, ఓసీ 1 ఎన్విరాన్మెంట్ అధికారి  కిషన్, బేస్ వర్క్ షాప్ హెచ్‌ఓ‌డి  జి‌వి సత్యనారాయణ, సంక్షేమ అధికారి సాయికృష్ణ ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


TV Murali Mohan
Editor
9391184768/9133301162
9154886719 ( whatsapp only)

9 attachments • Scanned by Gmail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *