సిరా న్యూస్,తిరుమల;
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకముందు ఆలయ మహద్వారం చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు., ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్థికాఫల్ స్వాగతం పలికారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోనికి ప్రవేశించారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి జేఈవో వీరబ్రహ్మం సీఎం చంద్రబాబును శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం చంద్రబాబు వారి కుటుంబసభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయంకు అభిముఖంగా ఉన్న అఖిలాండం వద్ద శ్రీవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించారు. తదనంతరం శ్రీ గాయత్రి నిలయం అతిధి గృహానికి తిరుగుప్రయాణం అయ్యారు.
======================