సిరా న్యూస్,అమరావతి;
ఫిబ్రవరి – మార్చినెలల్లో సీఎం జగన్ పర్యటనలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 13 వైజాగ్ లో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కు అయన హజరవుతారు. ఫిబ్రవరి 16న కుప్పం నుండి వైయస్సార్ చేయూత విడుదల చేస్తారు. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం, కొత్త మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 21 అన్నమయ్య జిల్లా నుండి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తారు.
ఫిబ్రవరి 24 కర్నూలు నుండి వైస్సార్ ఈ బీసీ నేస్తం మూడవ విడత, పిబ్రవరి 27 న గుంటూరు నుండి విద్యా దీవెన నాలుగవ విడత, మార్చి 5 – సత్యసాయి జిల్లా నుండి వసతి దీవెన రెండవ విడత విడుదల చేస్తారు. మార్చి 6- చివరి క్యాబినెట్ సమావేశం ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయని సమాచారం..