సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేయడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. కుటుంబం యూనిట్ గా చేసుకొని ఒక్కోక్క కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుతో ముడి పెట్టడంతో విపక్షాలు సైతం పుభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నమ్మకద్రోహంగా ఆరోపిస్తున్నాయి. భేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకునేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదని మండిపడుతున్నాయి. రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిన ప్రభుత్వం వడపోతకు ఎక్కువ ప్రధాన్యత ఇవ్వడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు 2018 డిసెంబర్ 12 కంటే ముందు ఉన్న వారి రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. రైతులకు రుణభారం తగ్గిస్తుందని అనుకుంటే… ప్రభుత్వం తన భారాన్ని దించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. రేషన్ కార్డు, ప్రామాణికం అంటేనే లక్షల మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రుణమాపీ చేస్తామని ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాయమాటలతో మభ్యపెడుతోందని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్న వారి జాబితాను వెంటనే రిలీజ్ చేయాలని మార్గదర్శకాలను కూడా సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డు లేని వాళ్లు, పింక్ కార్డు ఉన్న వారి పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఎలాంటి షర్టులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతులు, ప్రతిపక్షాల డిమాండ్ కు ప్రభుత్వం దిగి వస్తుందా…? లేదంటే తన పంతాన్ని నెగ్గించుకుంటుందా…? అనేది ఉత్కంఠంగా మారింది.
==========================