సిరా న్యూస్, జైనథ్:
సీఎం సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు. శుక్రవారం ఈ మేరకు గ్రామాల వారిగా ప్రత్యేక వాహనాల్లో ఇంద్రవెల్లి సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జై కాంగ్రెస్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.