Cold Pressed Oil: ఆదిలాబాద్‌లో నాణ్యమైన కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

ఆదిలాబాద్‌లో నాణ్యమైన కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌
+ ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య సృహా
+ కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌కు భారీ డిమాండ్‌
+ ప్యూర్‌ కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌ పేరిట ఆదిలాబాద్‌లో ప్లాంట్‌
+ ఈ రంగంలో రాణిస్తున్న యువ వ్యాపారవేత్త కుంట అరుణ్  కుమార్ రెడ్డి

వంటకాల్లో నూనెకు ఉన్న ప్రత్యేక స్థానం అందరికి తెలిసిందే. నేడు ఎక్కడ చూసిన కల్తీ నూనెలు సర్వసాధారణంగా కనిపిస్తుండటంతో బ్రాండెడ్‌ నూనెలను సైతం నమ్మలేని పరిస్థితి నెలకొంది. పెద్ద పెద్ద పరిశ్రమలు ఉత్పత్తిని పెంచడానికి గింజల నుండి నూనెను తీయడానికి భారీ యంత్రాలను వాడుతుంటారు. దీని ద్వార నూనె వేడెక్కి పోషకాలు తొలగిపోతాయి. ఎక్కువ కాలం మన్నిక కోసం అనేక రసాయనాలను సైతం కలపడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్య సృహ విపరీతంగా పెర్గడంతో జనాలు తినే అహారం, నూనెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇప్పుడు కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మిషిన్‌ ద్వార చెక్కతో గానుగ పట్టి గింజల నుండి నూనె తీయడంతో నూనె రుచికరంగా మారడమే కాకుండా పోషక విలువలు సైతం అధికంగా ఉంటాయని ప్యూర్‌ కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌ నిర్వహకులు, యువ వ్యాపారవేత్త కుంట అరుణ్ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. దీనిపై “సిరా న్యూస్‌ ” ప్రత్యేక కథనం…

కళ్లముందరే నూనె తయారీ…

సాధారణంగా మనం తీసుకునే ఏ నూనె కూడ మన కళ్లముందర తయారుకాదు. అయితే కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌ విషయంలో మాత్రంలో నిర్వహకులు మనం తీసుకొచ్చిన గింజలను మన ముందరే ప్లాంట్‌లో గానుగ పట్టి ఇస్తారు. ఆదిలాబాద్‌ పట్టణంలో తాంసి బస్టాండ్‌కు కూత వేటు దూరంలో గల సీసీఐ పక్కన ఉన్న ప్యూర్‌ కోల్డ్‌ప్రెస్డ్‌ అయిల్‌ ప్లాంట్‌లో పల్లి, కొబ్బరి, ఆవ, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఔషలు, కుసుమలు, సన్‌ఫ్లవర్‌ ఇలా అన్ని రకాల గింజలు అందుబాటులో ఉంటాయి. గింజల ధరతో పాటు కిలోకు రూ. 30 అదనంగా చెల్లిస్తే, మన కళ్ల ముందరే నూనె తీసి ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పవచ్చు. అయితే బయట మార్కెట్‌తో పోలిస్తే గింజల ధర కూడ ఇక్కడ తక్కువగా ఉండటంతో జనాలు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఎంచుకున్న గింజలను బట్టీ 10 కిలోల గింజలకు 2.5 లీటర్ల నుండి 4 లీటర్ల వరకు నూనె వస్తుందని నిర్వహకులు కుంట అరుణ్ రెడ్డి చెబుతున్నారు.

==================================ఉద్యోగుస్తుల నుండి భారీ డిమాండ్‌…

ఆదిలాబాద్‌ పట్టణంలో కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌పై అవగాహాణ పెరుగుతుందనే చెప్పవచ్చు. గత రెండు సంవత్సరాలుగా ఈ ప్లాంట్‌ నిర్వహిస్తున్నాము. మాకు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్‌ కస్టమర్లుగా ఉన్నారు. కళ్లముందే నూనె తీసి ఇవ్వడంతో కల్తీకి ఆస్కారం ఉండదు. దీనికి తోడు కోల్డ్‌ప్రెస్డ్‌ విధానంలో నూనె తీయడంతో పోషకాలు కూడ ఎక్కువగా ఉంటాయి. మెల్లిమెల్లిగా మార్కెట్‌ పెరుగుతోంది. సాధారణ ప్రజలు సైతం కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌ కొనుగోలు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు.

-కుంట అరుణ్ రెడ్డి, యువ వ్యాపారవేత్త (సెల్:8309545108)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *