పురుగుల మందు తాగిన డ్రైవర్
సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం కలెక్టర్ సిసి రఫీ వేధింపులు తాళ్ళలేక డ్రైవర్ ఆత్మహత్యయత్నం చేసాడు. ఖమ్మం స్థానిక సంస్థల కలెక్టర్ వాహన డ్రైవర్ గా బానోత్ హరిసింగ్ పని చేస్తున్నాడు. కలెక్టర్ సిసి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగాడు. స్థానిక సంస్థల నూతన కలెక్టర్ గా విధుల్లో శ్రీజ చేరారు.స్థానిక సంస్థలు కలెక్టర్ నీ తీసుకొచ్చేందుకు డ్యూటీ డ్రైవర్ హరిసింగ్ నీ కాదని వేరే డ్రైవర్ ను రఫీ పంపాడు. తాను వెళ్తానని చెప్పినా వేరే వ్యక్తిని ఎందుకు పంపారని సిసి రఫిని హరిసింగ్ అడిగాడు.రేపటినుండి డ్రైవర్ గా యువరాజ్ డ్యూటీ చేస్తాడని సిసి రఫీ చెప్పడంతో మనస్థాపం చెందిన హరిసింగ్ పురుగుల మందు తాగాడు. తనను సిసి రఫీ కావాలనే స్థానిక సంస్థల కలెక్టర్ దగ్గర డ్యూటీ వద్దంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసాడు. తనకు ఏదైనా జరిగితే సిసి రఫీదే బాధ్యత అని బోరున విలపించాడు. తన భర్తకు ఎదైనా జరిగితే తాను తన పిల్లలం పురుగుల మందు తాగి చనిపోతామని హరిసింగ్ భార్యఅంటోంది.