సిరా న్యూస్,పిఠాపురం;
జిల్లా వ్యాప్తంగా మిచాంగ్ తుఫాను తీవ్ర ఉద్రిక్తత నెలకొల్పుతుంది. ఈ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకొల్లులంగా పెద్ద పెద్ద కేరటాలతో సముద్రం విరుచుకుపడుతుంది. ఈ తీవ్రత వల్ల సముద్ర తీర ప్రాంతానికి అనుకుని ఉన్న రోడ్లు కోతకు గురయ్యాయి, అటుగా ప్రయాణించే ప్రయాణికులను రానివ్వకుండా రోడ్లను పోలీస్ అధికారులు మూసి వేసారు. ఈ తుఫాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గ సముద్ర పరిసర ప్రాంత ప్రజలను జిల్లా అధికార యంత్రాంగం పునరవాస కేంద్రలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పరిశీలించారు. వారికి భోజన, మెడికల్ అన్ని రకాల సదుపాయాలను వారికి సమకూర్చమని వెల్లడించారు.
అదేవిధంగా పోలీసు యంత్రాంగం, రెవిన్యూ అధికారరులు కూడా ముందుగా అప్రమత్తమయ్యి ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందుగా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.