Collector Koya Shri Harsha: ఉపాధి హామీ రికార్డులను కట్టుదిట్టంగా నిర్వహించాలి : కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సిరాన్యూస్,కాల్వశ్రీరాంపూర్
ఉపాధి హామీ రికార్డులను కట్టుదిట్టంగా నిర్వహించాలి : కలెక్టర్ కోయ శ్రీ హర్ష
* వనమహోత్సవం మొక్కల సంరక్షణకు వాచర్స్ నియామకం
* పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ఉపాధి హామీ రికార్డులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్ద‌పెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం, తదితర అంశాల పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో జరుగుతున్న పారిశుధ్యం, వన మహోత్సవం కార్యక్రమం, త్రాగునీటి సరఫరా తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూవనమహోత్సవం కార్యక్రమం క్రింద గ్రామాలలో నాటిన మొక్కల సంరక్షణకు వాచర్స్ ను నియమించాలని అన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని, గ్రామాల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి లను ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండటానికి వీలులేదని, అవసరమైన చోట వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమం క్రింద 100శాతం మొక్కల నాటే లక్ష్యం పూర్తయిందని తెలుసుకున్న కలెక్టర్ వాటి సంరక్షణకు వాచర్స్ ను నియమించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ ను పూర్తి స్థాయిలో వినియోగించాలని , తడి చెత్తతో తప్పనిసరిగా వర్మి కాంపోస్ట్ రూపొందించాలని, జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన వివరాలతో కూడిన 7 రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.అనంతరం కాల్వ శ్రీరాంపూర్ లోని ఎస్సీ ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ పంచాయతీ కార్యదర్శుల ద్వారా వసతి గృహాల్లో పారిశుధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని ఎంపీడీవోను ఆదేశించారు . అనంతరం కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం పై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీవో రామ్మోహన్ చారి , తహసిల్దార్ శంకర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *