Collector Koya Shri Harsha: డాక్టర్ అయేషా ఉస్మాన్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సిరాన్యూస్, ఓదెల
డాక్టర్ అయేషా ఉస్మాన్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష
* డ్యూటీ వేళ‌ల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు

డ్యూటీ వేళ‌ల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే ప్రభుత్వ వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డిప్యూటీ సివిల్ సర్జన్ గైనకాలజి స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అయేషా ఉస్మాన్ గత 8 నెలల నుంచి విధులకు సరిగ్గా హాజరు కాకుండా,ముందస్తు అనుమతి లేకుండా సెలవులు వినియోగించుకోవడం గమనించామని, గత 8 నెలలో ఆ డాక్టర్ ఒక రోజు కూడా రెసిడెంట్ డాక్టర్ గా 24 గంటల డ్యూటీ నిర్వహించలేదని తెలిపారు.ఎమర్జెన్సీ సేవలలో విధులు నిర్వహించే వైద్యురాలు విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ డిప్యూటీ సివల్ సర్జిన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వ గైనకాలజిస్టులు వారికి కేటాయించిన డ్యూటీ సమయంలో ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించే వైద్యుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *