సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో స్థానిక అగ్రికల్చర్ కాలేజీ ప్రాంగణంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సిబ్బందికి తగు సూచనలు చేసారు. ప్రిసైడింగ్ అధికారులు చెక్ లిస్ట్ ఆధారంగా క్రమపద్ధతిలో తమ విధులను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. 13వ తేదీన ఉదయం 5 గంటల్లోగా ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు.