మల్లన్న సాగర్ కాలనీ సమస్యపై కలెక్టర్ సమీక్ష

సిరా న్యూస్,సిద్దిపేట;
మల్లన్న సాగర్ అర్ కాలనీ వాసుల సమస్యలుగురించి రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ ఆర్ ఆండ్ ఆర్ కాలనీ వాసుల నష్టపరిహారం ఓపేన్ ప్లాట్లు అందజేత ఆర్ ఆండ్ ఆండ్ లో మౌలిక వసతులు కల్పన, గుడి మరియు బడులకు సంబంధిత విషయాల గుర్చి విసృతంగా చర్చించారు. సాగర్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి దశల వారిగా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డిఓలకి సూచించారు. ముఖ్యంగా అత్యవసరము ఉన్న వాటిపై దృష్టి పెట్టాలని అదికారులకు సూచించారు.
గజ్వేల్ పట్టణంలోని నిర్మించిన రెండు పడకల ఇండ్లను అసలైన లబ్ధిదారులకు మాత్రమే అందించాలి. ఈ వారంలో ఆర్డీవో నేతృత్వంలో ప్రస్తుతం ఇండ్లలో నివసిస్తున్న వారితో సమావేశం నిర్వహించి చర్చలు జరపాలని ఆర్డిఓ కు సూచించారు.
జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు భూసేకరణ భూమీ వ్యాల్యూ ను లెక్క కట్టడం కోసం కమిటీని వేస్తున్నట్లు తెలిపారు ఆ కమిటీలో అదనపు కలెక్టర్ రెవెన్యూ, ఆర్డీవో, జాయింట్ రిజిస్టర్ అర్బన్ లో మున్సిపల్ కమిషనర్, రూరల్ లో జిల్లా పంచాయతీ అధికారి సభ్యులని తెలిపారు. ఈ సమీక్షలో సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీఓలు సదానందం బన్సీలాల్ తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *