సిరాన్యూస్, కళ్యాణదుర్గం
పరిహారం అందించేలా చర్యలు: ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
* నష్టపోయిన పంటలను పరిశీలన
నష్టపోయిన పంటలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో అధిక వర్షపాతం వల్ల చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన 5 ఎకరాలలో టమోటా, కర్బూజా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. శనివారం నష్టపోయిన పంటలను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో పంట నష్టం వివరాలను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన పంటలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవడంజరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి ప్రాథమిక నష్టం అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాణి సుస్మిత, ఎడిఎ యల్లప్ప, తహసీల్దార్ భాస్కర్, ఏఓ జగదీష్, తదితరులు పాల్గొన్నారు