సిరా న్యూస్;
మళ్లీ మొదలైంది.. ఢిల్లీకి రైతుల ట్రాక్టర్ యాత్ర కొనసాగింది. వాళ్లు రైతులా? వాళ్ల ముసుగులో అరాచకవాదులా? అన్నది తెలియడం లేదు. అసలు వీరి డిమాండ్ ఏంటి? పంజాబ్ రైతులు చేస్తున్న డిమాండ్ ఏంటి?కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం కావాలన్నది ప్రధాన డిమాండ్. ఇక రుణమాఫీ, 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్, డబ్ల్యూ.టీవో నుంచి ఉపసంహరణ, ఉపాధి పథకం కింద పనిదినాలు రెట్టింపు, గత ఆందోళనలో పెట్టిన క్రిమినల్ కేసులన్నీ రద్దు.. కరెంటు చట్టం పూర్తిగా వెనక్కి తీసుకోవాలన్నది రైతుల డిమాండ్.పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల రైతు సంఘాల నాయకత్వంలో ‘దిల్లీ చలో’ రైతు ఉద్యమం మొదలైంది.2020-21 రైతు ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది దీనిని ‘కిసాన్ ఆందోళన్ 2.0’ (రైతు ఆందోళన 2.0)గా పిలుస్తున్నారు.అయితే, పోయిన సారి ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమం చాలా భిన్నమైంది.మరింత విపులంగా చెప్పాలంటే, ప్రస్తుత రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న నాయకులు, ఉద్యమంపై ప్రభుత్వ వైఖరి, రైతుల డిమాండ్లలో కూడా పాత ఉద్యమంతో పోలిస్తే చాలా వ్యత్యాసాలున్నాయి.కానీ, ఈ ఉద్యమాన్ని 2020-21 రైతు ఉద్యమానికి కొనసాగింపుగా పిలుస్తున్నారు. ఈసారి రైతులు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమిస్తున్నారని రాజకీయ వ్యవహారాల నిపుణులు, ప్రొఫెసర్ మహ్మద్ ఖలీద్ అన్నారు.”గతంలో జరిగిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈసారి ఎన్నికలు కూడా దగ్గరపడ్డాయి. కాబట్టి దీనిని త్వరగా పరిష్కరించకపోతే హరియాణా ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నష్టపోవచ్చు” అన్నారాయన.”ఈసారి రైతులు కూడా దృఢంగా ఉన్నారని అనుకుంటున్నా. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది, అది ప్రభుత్వానికి నష్టం కలిగించవచ్చు” అన్నారు.”2020లో రైతులు దిల్లీ వైపు కదం తొక్కినప్పుడు అది కేవలం మూడు రోజుల కార్యక్రమం. కానీ అది ఆ తర్వాత ఏడాది వరకూ కొనసాగింది’ఈసారి రైతు సంఘాలు నిరవధిక ధర్నాను ప్రకటించాయని ఆయన అన్నారు.ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ – 2020 (వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం), ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఎస్యూరెన్స్ అండ్ అగ్రికల్చరల్ సర్వీసెస్ యాక్ట్ 2020 (ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతు ఒప్పంద చట్టం)” ”ఎసెన్షియల్ కమోడిటీస్ ఎమెండ్‌మెంట్ యాక్ట్ 2020 (నిత్యవసర వస్తువుల సవరణ చట్టం)” ఉపసంహరణ.స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు చట్టపరమైన కనీస మద్దతు ధర కల్పించాలి.2013 భూసేకరణ చట్టం జాతీయ స్థాయి అమలు, భూ సేకరణలో రైతు లిఖితపూర్వక సమ్మతితో పాటు కలెక్టర్ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్లు చెల్లించాలి.ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడం, రోజుకు రూ.700 చొప్పున ఏడాదికి 200 రోజుల ఉపాధి హామీ కల్పించాలి.రైతులు, రైతు కూలీలకు పూర్తి రుణమాఫీ చేయాలి.లఖింపూర్ ఖేరీ ఘటన బాధ్యులకు శిక్ష పడేలా చూడాలి.2020-21 దిల్లీ కిసాన్ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలి.రైతులు, కార్మికులకు వృద్ధాప్య పింఛన్ పథకం అమలు చేయాలి.నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీ కంపెనీలు, వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉండేలా చూడాలి.పసుపు, మిరప, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు ప్రోత్సాహానికి కమిషన్లు ఏర్పాటు చేయాలి.ఆందోళనలు మొదలవడానికి ముందు రైతులతో ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు మాట్లాడిందని సూర్జిత్ సింగ్ ఫూల్ తెలిపారు. అయితే, డిమాండ్ల పరిష్కారంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది.యునైటెడ్ కిసాన్ మోర్చ (నాన్ పొలిటికల్), యునైటెడ్ కిసాన్ మోర్చా నుంచి 2022లో విడిపోియింది.2020-21 ఉద్యమం భారతీయ కిసాన్ యూనియన్, యునైటెడ్ కిసాన్ మోర్చా నేతృత్వంలో జరిగింది.యునైటెడ్ ఫార్మర్స్ ఫ్రంట్ కింద దేశవ్యాప్తంగా 500లకు పైగా రైతు సంఘాలు ఇందులో పాల్గొన్నాయి.ఇందులో పంజాబ్‌కి చెందిన భారతీ కిసాన్ యూనియన్-ఉగ్రహాన్ సహా 37 సంఘాలు ఉన్న యునైటెడ్ కిసాన్ మోర్చా లేదుప్రస్తుత దిల్లీ చలో ఉద్యమానికి యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వం వహిస్తున్నాయి.యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) 2022లో యునైటెడ్ కిసాన్ మోర్చా నుంచి విడిపోయిన ఒక వర్గం.ప్రస్తుత దిల్లీ చలో ఉద్యమంలో 200లకు పైగా సంస్థలు పాల్గొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.గతంలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్యులు ఈసారి కనిపించడం లేదు.