సిరా న్యూస్,హైదరాబాద్;
కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. ఈ మేరకు అయన ట్విట్టర్ లో స్పందించారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న తో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని అయన పేర్కోన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.