సిరా న్యూస్,సికింద్రాబాద్;
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీ లను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసారు.