సిరా న్యూస్, బేల
ఆత్రం సుగుణకు ఎంపీ టికెట్
కాంగ్రెస్ నాయకుల సంబరాలు
* మండలంలో భారీ ర్యాలీ
* కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం
* మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగాణక్క కు టికెట్ ఖరారైంది. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక శివాజీ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా కార్యకర్తలు సుగాణక్క కు అభినందనలు తెలియజేసి సంతోషం వ్యక్తం చేశారు. జై కాంగ్రెస్,చేతి గుర్తుకే మన ఓటు అంటూ నినాదలు చేస్తూ భారీగా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆదివాసీ ముద్దు బిడ్డ ఆత్రం సుగాణక్క కు టికెట్ ఇవ్వడం పట్ల అధిష్టాననికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రజల్లో మమేకమయ్యేలా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.