సిరాన్యూస్,భీమాదేవరపల్లి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఐక్యత చాటాలి: కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిట్టంపల్లి ఐలయ్య
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టంపల్లి ఐలయ్య బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకంమై ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐక్యత చాటుతామని అన్నారు. ఎన్నికల ముందు పార్టీ శ్రేణులను కొందరు గందరగోళ పరిచే ఆవకాశం ఉందన్నారు. అలాంటి వాటిని తిప్పికొట్టే విధంగా పని చేయాలని కోరారు.తమ ప్రభుత్వం పని చేస్తుంటే కాళ్లలో కట్టే పెట్టినట్లు మండల కాంగ్రెస్ పై కొందరు వ్యక్తులు కావాలని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మండల కాంగ్రెస్ లో ఎంతమంది సీనియర్ నాయకులం ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలల్లో గందరగోళం సృష్టించడానికే అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ముందున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని, పార్టీ కోసం కష్టపడ్డ వారికే, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటుందని, అధిష్టానం చెప్పిన విషయాన్ని మరవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కుట్రలను భగ్నం చేయాలని కోరారు.