Congress Donta Sudhakar : పేద‌ల కోసం పాటుప‌డిన గొప్ప నేత వైఎస్సార్  :కాంగ్రెస్ మండ‌ల‌ అధ్యక్షుడు దొంత సుధాకర్

సిరాన్యూస్‌, సైదాపూర్
పేద‌ల కోసం పాటుప‌డిన గొప్ప నేత వైఎస్సార్  :కాంగ్రెస్ మండ‌ల‌ అధ్యక్షుడు దొంత సుధాకర్
* ఘనంగా వైయస్. రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి

పేద‌ల కోసం పాటుప‌డిన గొప్ప నేత .వైయస్. రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ అన్నారు.
సోమ‌వారం సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డా.వైయస్. రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ మాట్లాడుతూ ఆరోగ్య ప్రదాత, ప్రజల గుండెల్లో చిరకాలం చెరగని సంతకం చేసిన గొప్పనేత వైఎస్సార్ అని, ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, ఎర్రల శ్రీనివాస్, మండల కొమురయ్య, పిట్టల రాకేష్, గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపెల్లి యాదగిరి, మీస బీరయ్య, అంబాల ప్రేమ్ కుమార్, కాశివేణి రవీందర్, బొమ్మగాని రాజు, గడ్డం శేఖర్, మేకల రాజు, జంపాల రామకృష్ణ, అందె వెంకటేశ్వర్లు, కొత్త మహేందర్ రెడ్డి, గుంటి స్వామి, తాళ్లపల్లి రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు వేముల సాయికుమార్ ల్, బానోత్ తిరుపతి నాయక్, బోనగిరి అనిల్, బానోత్ ప్రవీణ్, ఎన్ఎస్ యు ఐ, నాయకులు తలారి రోషన్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *