సిరాన్యూస్, సైదాపూర్:
సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన మండల అధ్యక్షుడు దొంత సుధాకర్
సైదాపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం వివిధ గ్రామాల్లో నిర్వహించారు. ఈసందర్బంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ 35 చెక్కులు ద్వారా 6,78,000 వేల రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్కులు రావడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిష్టయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లంక దాసరి మల్లయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పోగు రమేష్, జున్నుతుల రాజేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మీస బీరయ్య, సమ్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి మేకల రవీందర్, సురేందర్ రెడ్డి, చంద్రమౌళి, కరుణాకర్, సంపత్ పద్మనాభం, రాజ్ కుమార్, శంకర్, రాజేష్, మేకల రాజు, గుంటి స్వామి తదితరులు పాల్గొన్నారు.